e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ఘనంగా ఫలహారం బండ్ల ఊరేగింపు

ఘనంగా ఫలహారం బండ్ల ఊరేగింపు

  • పలు ఆలయాల్లో అమ్మవారికి భక్తులు పూజలు
  • పాల్గొన్న మంత్రి తలసాని, ఎమ్మెల్యే మైనంపల్లి
  • ఆకట్టుకున్న తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపు
  • పలు చోట్ల భవిష్యవాణి
  • ముగిసిన బోనాల జాతర

మల్కాజిగిరి, ఆగస్టు 2: బోనాల ఉత్సవాలు సోమవారం రంగం కార్యక్రమంతో ముగిశాయి. మల్కాజిగిరిలోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయం వద్ద యాప్రాల్‌కు చెందిన ఏర్పుల రవీందర్‌ భవిష్యవాణి వినిపించారు. సకల జనులను కాపాడుకునే బాధ్యత నాది అని ప్రతి ఒక్కరూ అమ్మవారికి భక్తిశ్రద్ధ్దలతో పూజలు నిర్వహించాలని సూచించారు.ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ గా ప్రతి ఏటా మాజీ కార్పొరేటర్‌ దంపతులు నిరుగొండ జగదీశ్‌గౌడ్‌, మంజుల గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఫలహారం బండి ఊరేగింపు పలువురిని ఆకట్టుకుంది. పాత మల్కాజిగిరి నుంచి బ్యాండ్‌మేళాలు, కళాకారుల విన్యాసాలు, పోతరాజుల నృత్యాలు, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫలాహా రం బండి ఊరేగింపులో ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ కార్పొరేటర్‌ ప్రేమ్‌కుమార్‌, పలువురు ప్రజా ప్రతినిధులు,నిర్వాహకులు ఉన్నారు.

మారేడ్‌పల్లి, ఆగస్టు 2: మోండా డివిజన్‌ మారేడ్‌పల్లిలోని శ్రీ మైసమ్మ ఆలయంలో ఆలయ నిర్వాహకులు సి. కృష్ణయాద వ్‌, తిరుమలవంశీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన బోనాల ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వ ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, కార్పొరేటర్‌ రూప పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వినాయక్‌నగర్‌/బొల్లారం,ఆగస్టు 2: కంటోన్మెంట్‌ ఎనిమిదో వార్డు బొల్లారం ముత్యాలమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే హన్మంతరావు, స్థానిక మాజీ బోర్డు సభ్యుడు లోక్‌నాథ్‌తో కలిసి అమ్మవారినికి ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహేశ్‌, చందర్‌, కన్నా పాల్గొన్నారు. అదేవిధంగా మచ్చ బొల్లారం ఏడుగుళ్ల మహంకాళి ఆలయంలో కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించాలని వేడుకుంటూ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాజ్‌ జితేంద్రనాథ్‌, శ్రావణ్‌ముదిరాజ్‌, సురేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీశైలం యాదవ్‌, దేవేందర్‌ పాల్గొన్నారు.

- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 2: బోనాల జాతరలో భాగంగా తార్నాక డివిజన్‌లోని పలు ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఫలహారం బండ్లను ఊరేగించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో కలిసి నగర డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నామన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana