e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home హైదరాబాద్‌ కరుణగల్ల తల్లీ..కరుణించమ్మా

కరుణగల్ల తల్లీ..కరుణించమ్మా

  • ఘనంగా అమ్మవార్లకు బోనాలు
  • తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభం
  • పట్టువస్ర్తాలను సమర్పించిన డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌
  • అమ్మవారి పూజల్లో ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు

సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో ఉన్న మైసమ్మ, పోచమ్మల అమ్మవార్ల దేవాలయాల్లో ఆషాఢమాస బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాలను చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారి జానపద గీతాలు భక్తులను అలరిస్తుండగా… డప్పు దరువుల మధ్య పోతరాజుల నృత్యాలతో తెలంగాణ సంప్రదాయాలు కళ్లకు కట్టే విధంగా ఫలహారం బండ్ల ఊరేగింపులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

సికింద్రాబాద్‌/మల్కాజిగిరి/కంటోన్మెంట్‌/గౌతంనగర్‌/వినాయక్‌నగర్‌/నేరేడ్‌మెట్‌ , ఆగస్టు 1:
చిలకలగూడలో.. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు అత్యంత వైభవంగా జరిగిన చిలకలగూడలోని కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అమ్మవార్ల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ పల్లె మోహన్‌రెడ్డి, జలమండలి డీజీఎం వై. కృష్ణ, కార్పొరేటర్లు ఇతర నేతలు దర్శనాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కిశోర్‌గౌడ్‌, కిరణ్‌కుమార్‌ గౌడ్‌, రామేశ్వర్‌గౌడ్‌, త్రినేత్రగౌడ్‌, గరికపాటి చంద్రశేఖర్‌, కందినారాయణ తదితరులు పాల్గొన్నారు.

బంగారు మైసమ్మ ఆలయంలో..మంత్రి తలసాని

- Advertisement -

మధురానగర్‌ కాలనీలోని బంగారు మైసమ్మ ఆలయం చైర్మన్‌ గుర్రం పవన్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాలలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పవన్‌కుమార్‌ గౌడ్‌, గంగాపురం ఆంజనేయులు ఇతర నేతలు పాల్గొన్నారు.

నల్లపోచమ్మ దేవాలయంలో..ఎమ్మెల్యే

మౌలాలి డివిజన్‌ పరిధిలోని పీబీకాలనీలో నల్లపోచమ్మ దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అమ్మవారిని దర్శించుకున్నారు. కాలనీ, దేవాలయ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు రాంచందర్‌, కే.ఎల్లయ్య, శంకర్‌రావు, అచ్యుతాచారి,నారాయణరావు, వీరేందర్‌, నాగేందర్‌, రామదాస్‌, రమేశ్‌,ఎండీ.సాధిక్‌ పాల్గొన్నారు.

అందరికీ అమ్మవారి ఆశీస్సులు

అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో బోనాల పండుగ వేడుకలో దేవాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు సబితాకిశోర్‌, శాంతిశ్రీనివాస్‌ రెడ్డి, రాజ్‌ జితేంద్రనాథ్‌, డిప్యూటీ కమిషనర్‌ నాగమణి పూజలు నిర్వహించారు.

వైభవంగా బోనాల జాతర

ఆషాఢ అమ్మవారి బోనాల జాతర మల్కాజిగిరి నియోజక వర్గంలో అంగరంగవైభవంగా జరిగింది. బోనాల సమర్పణతో అన్ని అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. మూడేళ్ల తర్వాత అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేసే భాగ్యం లభించడంతో పలువురు భక్తులు తమతమ మొక్కులు తీర్చుకున్నారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు వురపల్లి శ్రావణ్‌కుమార్‌, వై. ప్రేంకుమార్‌, మేకల సునీతా రాము యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ దంపతులు ఎన్‌. జగదీష్‌గౌడ్‌, మంజుల గౌడ్‌, వివిధ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana