పోలీసులు పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఓ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగం కువాన్ పోలీస్ స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఈ మంటలు చెలరేగాయి. వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలకు నిప్పంటుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో చాలా వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై అగం కువాన్ పోలీసులు విచారణ చేపట్టారు.