మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:46:54

మంత్రులను కలిసిన బోర్డు సభ్యులు

మంత్రులను కలిసిన బోర్డు సభ్యులు

కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు శక్రవారం రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని నివాసంలో జరిగిన సమావేశంలో పలు అంశాలను చర్చించారు. బోర్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని, ఆయా వార్డుల్లో జనం మధ్యలోనే ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బోర్డు సభ్యులు మెలగాలని సూచించారు.  కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడిగా  జక్కుల మహేశ్వర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని సభ్యులు సమన్వయంతో బోర్డు అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు సదా కేశవరెడ్డి, పాండుయాదవ్‌, లోక్‌నాథం, నళినికిరణ్‌, మాజీ సభ్యులు ప్రభాకర్‌, శ్యాంకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. logo