మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 06, 2020 , 00:23:25

తలసీమియా బాధితుల కోసం రక్తదానం

తలసీమియా బాధితుల కోసం రక్తదానం

సైబరాబాద్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ 

2783 యూనిట్ల రక్తం సేకరణ

సిటీబ్యూరో:  కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా రక్త నిల్వలు చాలా తగ్గాయి. దీంతో తలసీమియా, ఇతర వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత ఏర్పడింది. దీన్ని గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు లాక్‌డౌన్‌ నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయగా, మొత్తం 2783 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సైబరాబాద్‌ పోలీసులు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ , ఉస్మానియా జనరల్‌ దవాఖాన, తలసీమియా సికిల్‌ సెల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆదివారం శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 67 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్త దానంలో పాల్గొనేవారు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌రూం నంబర్‌ 9490617440, 9490617431లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. 


logo