బుధవారం 05 ఆగస్టు 2020
Hyderabad - Jul 14, 2020 , 23:02:55

మూడు వేల మందితో రక్తదాన శిబిరం

మూడు వేల మందితో రక్తదాన శిబిరం

జూలై 24న మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని.. 

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం 

వలంటీర్ల కోసం టీ షర్ట్స్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే 

బంజారాహిల్స్‌, నమస్తేతెలంగాణ: మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జూలై 24న మూడు వేల మందితో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదాన శిబిరంలో పాల్గొనే వలంటీర్ల కోసం రూపొందించిన టీషర్ట్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..లాక్‌డౌన్‌ నేపథ్యంలో రక్తం కొరత ఏర్పడిందన్నారు. దీన్ని అధిగమించడంతో పాటు రక్తదానాన్ని ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని మూడు వేల మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారన్నారు. ఇంతటి భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం రాష్ట్రంలోనే మొదటి సారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 


logo