శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Sep 19, 2020 , 00:14:51

పేదలకు వరం సీఎం సహాయనిధి

పేదలకు వరం సీఎం సహాయనిధి

చిక్కడపల్లి: పేదలకు వైద్య సేవలను అందించడానికి సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటును అందిస్తోందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఎల్వోసీ ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కును లబ్ధిదారుడు ఆనంద్‌, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ.14,500 చెక్కును భాస్కర్‌కు అందజేశారు. కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జైసింహ, మోజెస్‌, వివేక్‌, సిరిగిరి కిరణ్‌ కుమార శ్యామ్‌, దామోదర్‌ రెడ్డి, శంకర్‌ ముదిరాజ్‌, నాగభూషణం, జైదేవ్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చాదర్‌ఘాట్‌:  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల పంపిణీ చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో  తొమ్మిది మంది లబ్ధిదారులకు చె క్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  బలాల మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేవిధంగా చూస్తామన్నారు.