శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Jun 08, 2020 , 04:18:29

ఇన్‌స్టా గ్రామ్‌లో యువతికి బ్లాక్‌మెయిలింగ్‌

ఇన్‌స్టా గ్రామ్‌లో యువతికి బ్లాక్‌మెయిలింగ్‌

హైదరాబాద్ : ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తుండటంతో ఆమె సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు  చెందిన డిగ్రీ చదువుతున్న యువతికి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉంది. ఆ ఖాతాకు గుర్తుతెలియని వ్యక్తి అసభ్యకరంగా పోస్టింగ్‌ చేస్తూ.. అంతటితో ఆగకుండా నీ వ్యక్తిగత ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. వాటిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌  చేస్తానంటూ.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. దీంతో ఆమె ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్లాక్‌ మెయిలర్‌ వేటలో పడ్డారు.