శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:28:13

ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌

ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌

బాలికను బెదిరించి.. రూ.4లక్షలు వసూలు

ముగ్గురు యువకులు అరెస్ట్‌

జీడిమెట్ల : ఓ బాలిక ఫొటోలు తీసి.. బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.4లక్షలు కాజేసిన ముగ్గురు యువకులను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అయోధ్యనగర్‌లో నివాసం ఉండే 10వ తరగతి బాలిక.. తన ఇంటిపైన ఉంటున్న మరో బాలికతో కలిసి ఆన్‌లైన్‌ క్లాసులు వింటుంది. ఈ క్రమంలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎస్‌.ఎలీశా (21), వై.కిషోర్‌ (19), రామ్‌వికాస్‌ (21) లతో వీరికి పరిచయం ఏర్పడింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఈ ము గ్గురు.. బాలిక ఇంటికి వస్తుండేవారు. ఈ క్రమంలో సదరు బాలిక ఫొటోలు తీసి.. వాటితో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ రూ.4లక్షలు వసూలు చేశా రు. కాగా.. ఈ నెల 14న బాలిక ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు యువకులను కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో వారు 10వ తరగతి మెటీరియల్‌ కోసం వచ్చామని తెలుపగా.. బాలికను నిలదీశారు. కొన్ని రోజులుగా ఆ ముగ్గురు తన ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అసలు విషయం తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.