శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 01:46:35

వీడియో చాట్‌లతో ఎర అనంతరం బ్లాక్‌మెయిల్‌

వీడియో చాట్‌లతో ఎర అనంతరం బ్లాక్‌మెయిల్‌

హైదరాబాద్ :  లాక్‌డౌన్‌ సమయంలో సైబర్‌నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెరలేపారు. వీడియోకాల్స్‌తో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. కొందరు భయపడి అం తో ఇంతో ఇచ్చుకోగా.. భయపడినవారిని మరింతగా బెదిరించి వేలల్లో ముంచేస్తున్నారు. ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణా కు లాక్‌డౌన్‌ సమయంలో 40 వరకు వచ్చాయి. అందులో నలుగురు రూ.10 వేల నుంచి 60వేల వరకు డబ్బులు డిపాజిట్‌ చేయగా.. మరో 20 మంది వరకు రూ.5వేలలోపు డిపాజిట్లు చేశారు. మిగతా వారు జరుగుతున్న బ్లాక్‌మెయిలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారి చేతిలోపడి చాలామంది పోలీసులను ఆశ్రయించకుండా లోలోపల కుమిలిపోయారు. ఇదిలా ఉండగా పోలీసులమంటూ బెదిరిస్తే భయపడని వాళ్లకు సైబర్‌నేరగాళ్లు మరోరకంగా బెదిరింపులకు దిగుతున్నారు. సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు పెట్టి మీ ఇజ్జత్‌ తసేస్తామనడంతో కొందరు భయపడుతూ సైబర్‌నేరగాళ్లు అడిగినంత ఇచ్చుకుంటున్నారు.

చాటింగ్‌తో మొదలు పెట్టి..!

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లకు కొత్త స్నేహితులుగా రిక్వెస్ట్‌లు పంపిస్తారు. అమ్మా యి ప్రొఫైల్‌తో రిక్వెస్ట్‌లు రాగానే చాలామంది యాక్సెప్ట్‌ చేస్తారు. అలా స్నేహితురాలిగా అంగీకరించడంతోనే ఒకటి రెండు రోజులు చాటింగ్‌లో ఐదు, పది నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత ఆ యువతి.. వీడియోకాల్స్‌ల్లోకి రమ్మంటూ సూచించడంతో చాలామంది వీడియోకాల్‌లోకి వస్తారు. మాట్లాడుతుండగానే సదరు మహిళ నగ్నంగా మారిపోతూ.. ఇవతలి వ్యక్తులను కూడా అలాగే చేయమంటుంది. ఆ వీడియోను స్క్రీన్‌ రికార్డర్‌తో రికార్డు చేసి, ఐదునిమిషాల్లో కాల్‌ కట్‌ చేస్తోంది. మరుసటి రోజు ఫోన్‌ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుంది. 

రాజస్థాన్‌ నుంచే ఎక్కువ....!

బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న వీడియోకాల్స్‌పై సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఆరా తీశారు. వస్తున్న కాల్స్‌లో 80శాతం రాజస్థాన్‌కు చెందినవే ఉంటుండగా, కొన్ని బీహార్‌ ప్రాంతం నుంచి వస్తున్నట్లు గుర్తించారు. బ్లాక్‌మెయిలింగ్‌లో మహిళతోపాటు మరో ముగ్గురు ఉంటున్నారని పోలీసుల విచా రణలో బయటపడింది. ఒకరు పోలీస్‌గా.. మరొకరు బాధితురాలి తండ్రి/భర్త, ఇంకొకరు పెద్దమనిషిగా నటిస్తూ మాట్లాడుతున్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. 

బ్లాక్‌మెయిల్‌ చేస్తే ఫిర్యాదు చేయండి

చాటింగ్‌, వీడియోకాల్స్‌తో ఎవరైనా బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అమాయకులు దొరికితే అలాంటి వారి నుంచి అందిన కాడికి డబ్బును దోచేసే ప్రయ త్నం చేస్తుంటారు. ఫోన్‌ మాట్లాడే వ్యక్తి ఎవరు అని గుర్తించి సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడాలి. ముం దుగా సోషల్‌మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు, అప్పుడే పరిచయం అయ్యే వ్యక్తులతో మాట్లాడి గుడ్డిగా నమ్మకుండా దూరంగా ఉండాలి. 

- మోహన్‌రావు, సైబర్‌క్రైమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌logo