బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Sep 28, 2020 , 00:42:09

ఆచార్య కొండా లక్ష్మణ్‌ జీవిత చరిత్రను

ఆచార్య కొండా లక్ష్మణ్‌ జీవిత చరిత్రను

పాఠ్యాంశాల్లో చేర్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్తా

అంబర్‌పేట/ముషీరాబాద్‌/చిక్కడపల్లి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేలా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు, అంబర్‌పేట నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎనుగంటి నరేందర్‌ ఆధ్వర్యంలో గోల్నాక డివిజన్‌ కొత్త బ్రిడ్జి వద్ద బాపూజీ జయంతిని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, అతిథులుగా కార్పొరేటర్లు పులిజగన్‌, గరిగంటి శ్రీదేవి, మాజీ కార్పొరేటర్‌ దిడ్డి రాంబాబు, అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుశ్యంతల హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆదివారం కొండా లక్ష్మణ్‌ జయంతి నిర్వహించారు. రాంనగర్‌ ఈ సేవా వద్ద జరిగిన కార్యక్రమంలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్లు శ్రీనివాస్‌రెడ్డి, హేమలత, టీఆర్‌ఎస్‌ నేత ఎంఎన్‌ శ్రీనివాసరావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నేత శ్రీనివాస్‌, మనోహర్‌సింగ్‌, వివేక్‌, రూపేందర్‌, శ్యామ్‌సుందర్‌, మల్లేశ్‌, సిరిగిరి శ్యామ్‌, సురేందర్‌, సయ్యద్‌ అస్లాం, ఖాదీర్‌ పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ చౌరస్తాలో ముషీరాబాద్‌ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సుదేశ్‌, మనోహర్‌, చంద్రమౌలి, దశరత్‌, వినయ్‌, బొట్టు శ్రీను, వెంకటేశ్‌, గణేశ్‌ లక్ష్మణ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అశోక్‌నగర్‌లో ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత ఎంఎన్‌ శ్రీనివాస్‌రావు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ముఠా నరేశ్‌, ముఠా జైసింహ పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

త్యాగరాయగానసభ: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని గానసభ కళావీఎస్‌ జనార్దనమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్‌ వకళాభరణం కృష్ణమోహన్‌రావు (బీసీ కమిషన్‌), ఆచార్య గౌరీశంకర్‌ పాల్గొన్నారు. 


logo