శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Sep 29, 2020 , 00:35:11

భగత్‌సింగ్‌ సేవలు మరువలేనివి

భగత్‌సింగ్‌ సేవలు మరువలేనివి

అబిడ్స్‌:  భగత్‌సింగ్‌ జయంతిని సోమవారం రహీంపురాలో నిర్వహించారు.   భగత్‌సింగ్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌, మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరీసింగ్‌తో కలిసి పూలమాల  వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అన్నదానం చేశారు.  కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, శశిరాజ్‌సింగ్‌, వేణు ముదిరాజ్‌, ప్రదీప్‌ కుమార్‌, సంజయ్‌సింగ్‌, నిర్వాహకులు వై.నాగిరెడ్డి   పాల్గొన్నారు.

- భగత్‌సింగ్‌ యువసేన అధ్యక్షుడు లడ్డు యాదవ్‌ నేతృత్వంలో షహీద్‌ భగత్‌సింగ్‌ జయంతిని ముస్లింజంగ్‌ వంతెన వద్ద నిర్వహించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు రాములు, బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌  విచ్చేసి భగత్‌సింగ్‌  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు ఉమా మహేందర్‌, సురేశ్‌మాలి, జితేందర్‌ తివారి, బంగారు సుధీర్‌కుమార్‌, ఉదయ్‌భాస్కర్‌, నటరాజ్‌, గుణవంత్‌రావు, ఓం ప్రకాశ్‌, ముకుంద్‌ యాదవ్‌, విక్కీ సింగ్‌, లాల్‌సింగ్‌, చరణ్‌, సుమిత్‌, రోనక్‌, రంజిత్‌రెడ్డి, మన్‌మోహన్‌సింగ్‌, అన్మోల్‌, ప్రవీణ్‌ యాదవ్‌   పాల్గొన్నారు. 

చాంద్రాయణగుట్ట: చైతన్య యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతిని  నిర్వహించారు.  కార్యక్రమానికి సంఘ సేవకుడు కౌడి మహేందర్‌ ముఖ్య అతిథిగా హజరై భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు డి.సుశీల్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, యువకులు పాల్గొన్నారు.

- టీఆర్‌ఎస్‌ గౌలిపురా డివిజన్‌ అధ్యక్షుడు సీఎం ప్రవీణ్‌రాజు ఆధ్వర్యంలో  సోమవారం   భగత్‌సింగ్‌ జయంతిని నిర్వహించారు. నాయకులు శ్రీరాం కోటయ్య, బి.సాయిబాబా, నర్సింహాగౌడ్‌, భాస్కర్‌  భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి   నివాళులర్పించారు.

-జంగమ్మెట్‌ డివిజన్‌ డీవైఎఫ్‌ఐ నాయకుల ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా సోమవారం జంగమ్మెట్‌ నుంచి సిటీ కాలేజ్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.