ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 07:05:28

ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త

ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త

  • ప్రజల మధ్య చిచ్చుపెట్టే పోస్టులపై పోలీసు నిఘా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తూ.. బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నది.  మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన బెంగుళూరు ఎంపీ తేజస్వీ సూర్యను పోలీసులు క్యాంపస్‌ గేట్‌ వద్ద అడ్డుకున్నారని, ఉద్రిక్తత చోటుచేసుకుందంటూ ఫేక్‌ న్యూస్‌ను తయారు చేసి, దానిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. పోలీసులు ఎవరిని ఆపలేదని, ఆర్ట్స్‌ కాలేజీ వద్ద ప్రశాంతంగా బీజీపీ ఎంపీ సమావేశం నిర్వహించారని ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ రమేశ్‌  తెలిపారు.  ఇదిలాఉండగా ఎన్నికల నేపథ్యంలో టీవీల్లో బ్రేకింగ్‌  న్యూస్‌ వచ్చిదంటూ కొందరు తమకు అనుకూల ప్రకటనలు తయారు చేసుకొని, దానిని సోషల్‌మీడియాలలో వైరల్‌ చేస్తున్నారని, ఇలాంటి ఫిర్యాదుల సైబర్‌ క్రైం ఠాణాకు అందుతున్నాయని చెప్పారు.నకిలీ న్యూస్‌ను వైరల్‌ చేస్తున్న వారిపై నిఘా పెట్టామని చెప్పారు. 


logo