శుక్రవారం 07 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:18:45

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి

ఎమ్మెల్యేలు  కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌  

గోల్నాక : దోమలను నిర్మూలించి సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ పిలుపు నిచ్చారు. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్‌ కాలేరు పద్మతో కలిసి మారుతీనగర్‌లో రసాయనాలను పిచికారీ చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

చిక్కడపల్లి : సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీనగర్‌లోని హిమసాయి హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ఎమ్మెల్యే గోపాల్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు  ముఠా పద్మతో కలిసి పూల కుండీల్లో నిలువ ఉన్న నీటిని తొలగించి శుభ్రం చేశారు.  నాయకులు ముఠా నరేశ్‌,  ముఠా జైసింహ, శ్రీకాంత్‌, ప్రభాకర్‌,  ప్రేమ్‌, నవీన్‌ యాదవ్‌, సంతోష్‌,  అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమ రమేశ్‌, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, వైష్ణవి, హేమలత తదితరులు పాల్గొన్నారు. 

పరిసరాల పరిశుభ్రత పాటించాలి.. 

 దోమల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని రాంనగర్‌ కార్పొరేటర్‌ వీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాగ్‌లింగంపల్లిలో ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌  పరిసరాలను శుభ్రం చేశారు. నాయకులు సిరిగిరి శ్యామ్‌, ప్రకాశ్‌రెడ్డి, కల్యాణ్‌నాయక్‌ పాల్గొన్నారు.

అంబర్‌పేట : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని  కార్పొరేటర్‌ కె.పద్మావతి అన్నారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె ఇంటి ఆవరణలో నిలిచిన నీటిలో దోమల మం దును స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కె.దుర్గాప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. 

నల్లకుంటలో.. నల్లకుంట డివిజన్‌లో ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవిరమేశ్‌ పాల్గొని డివిజన్‌లోని బస్తీల్లో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయించి స్థానికులకు అవగాహన కల్పించారు. 

 అఫ్జల్‌నగర్‌ కాలనీలో.. 

మలక్‌పేట : పాత మలక్‌పేట డివిజన్‌లో కరోనా కేసులు  ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అన్ని కా లనీల్లో  రసాయనాలను పిచికారీ చేయాలన్న మలక్‌పేట ఎమ్మెల్యే బలాల ఆదేశాల మేరకు ఆదివారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అఫ్జల్‌నగర్‌, సలీంనగర్‌, తీగలగూడ  పరిసర కాలనీల్లో రసాయనాల పిచికారీతో పాటు ఈగలు, దోమల నివారణకు ఫాగింగ్‌ నిర్వహించారు.  


logo