బాలానగర్, మార్చి 20 : స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా బాలానగర్‌లో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 1.13కిలోమీటర్ల దూరంతో చేపట్టిన ఫ్లైఓవర్ కు మొత్తం 26పిల్లర్లు ఏర్పాటు చేశారు. ైప్లె ఓవర్‌కు ఇరువైపుల రెండు ర్యాంపు పిల్లర్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒక ర్యాంప్ పిల్లర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేయగా మరో ర్యాంప్ పిల్లర్‌ను ఎన్ఈర్ఎస్సీ వద్ద ఏర్పాటు చేశారు. రిలయన్స్ బంక్ నుంచి ఆంధ్రాబ్యాంక్ వరకు ఒక ర్యాంపు పనులు, ఎన్ఆర్ఎస్సీ నుంచి ఎస్ఎమ్మార్ వినయ్ క్యాపిటల్ బిల్డింగ్ వరకు రెండో ర్యాంప్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ర్యాంపు పనులను పక్కా ప్రణాళికతో చేస్తున్నారు. భవిష్యత్‌లో కూడా ర్యాంపులో ఎలాంటి లోపం తలెత్తకుండ ఉండడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ైప్లె ఓవర్ మొత్తంలో 26పిల్లర్లకు 25 పిల్లర్లలో గడ్డర్ల ఏర్పాటు పూర్తి అయింది. అదే విధంగా 22స్పాన్లలో స్లాబ్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్ మొత్తంలో 206ఆర్సీసీ గడ్డర్లు (బీమ్)లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు నర్సాపూర్ చౌరస్తాలో మరో రెండు స్పాన్లలో స్టీల్ గడ్డర్లకు గాను ఒక స్పాన్‌లో గడ్డర్ల ఏర్పాటు పూర్తి అయింది. మరో రెండు స్టీల్ స్పాన్లలో గడ్డర్ల ఏర్పాటు పూర్తి చేసి ఈ నెలాఖరు వరకు స్లాబ్ పనులు పూర్తి చేయనున్నారు. మొత్తం 25స్పాన్లకు గాను 22స్పాన్లలో స్లాబ్ పనులు పూర్తి అయ్యాయి.
మే నెలలో అందుబాటులోకి..
ైప్లెఓవర్ పనులను చకాచకా పూర్తి చేసి మే నెలలో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. 80శాతం వరకు ైప్లెఓవర్ పనులు పూర్తి అయ్యాయి. 22 స్పాన్లలో స్లాబ్ పనులు పూర్తి అయ్యాయి. ఈ నెలాఖరు వరకు స్లాబ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. మొత్తం 206 గడ్డర్లకు గాను ఇప్పటికే 200గడ్డర్లు ఏర్పాటు చేశాం. మే నెలలో అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.- యూసుఫ్ హుస్సేన్, హెచ్ఎండీఏ ఎస్ఈ
ట్రాఫిక్‌కు చెక్..
బాలానగర్‌లో చేపట్టిన ైప్లెఓవర్ పనులు పూర్తి అయి తే ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనుంది. ైప్లెఓవర్ పనుల పుణ్యమా అని బాలానగర్‌లో రహదారుల విస్తరణ చేపట్టడం వలన దాదాపుగా ట్రాఫిక్ రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. ైప్లె ఓవర్ పనులు పూర్తి అయితే బాలానగర్‌లో అసలు ట్రాఫిక్ జామ్‌లు ఉండవు. వాహనాలు సాఫీగా వెలుతుంటాయి. ైప్లె ఓవర్ అందుబాటులోకి వస్తే మొదట ప్రజలే సంతోషపడుతారు. తద్వారా వ్యాపారాభివృద్ధి కూడా మెరుగుపడుతుంది. – వెంకటయ్య, బాలానగర్ ట్రాఫిక్ సీఐ