e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి

బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి

బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి

చార్మినార్‌, జూలై 17: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ వేడుక కోసం పాత నగరంలోని ఈద్గాలో ఈదుల్‌ ఆదా నమాజ్‌ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం తెలిపారు. బహదూర్‌పురలోని మీరాలం ఈద్గాలో ఆయన వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం మాట్లాడుతూ, ప్రభుత్వ విధి విధానాల ప్రకారం, కరోనా నిబంధనలు పాటిస్తూ మీరాలం ఈద్గాలో ఈదుల్‌ ఆదా ప్రత్యేక ప్రార్థనలు కొనసాగించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే మీరాలం ఈద్గాలో బక్రీద్‌ నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, మైనార్టీ విభాగాలు సంయుక్తంగా బక్రీద్‌ వేడుక నిర్వహణ పనులకు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలకు హాజరు కానున్న భక్తుల కోసం వాటర్‌ వర్క్స్‌ విభాగం అధికారులు 50 వేల త్రాగునీటి ప్యాకెట్లను అందుబాటులో పెట్టనున్నారని మహ్మద్‌ సలీం తెలిపారు. కార్యక్రమంలో బహదూర్‌పుర ఎమ్మెల్యే మౌజంఖాన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ రాజేందర్‌ రెడ్డి, వాటర్‌ వర్క్స్‌ అధికారులు ఖాదర్‌ అలీతో పాటు జీహెచ్‌ఎంసీ డీఈ, ఏఈ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి
బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి
బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి

ట్రెండింగ్‌

Advertisement