సోమవారం 13 జూలై 2020
Hyderabad - May 26, 2020 , 01:53:11

ట్రాఫిక్‌‌ ఉల్లంఘనులపై సోషల్‌ మీడియా వేదికగా

ట్రాఫిక్‌‌  ఉల్లంఘనులపై సోషల్‌ మీడియా వేదికగా

హైదరాబాద్ : సోషల్‌ మీడియా వేదికగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాహనదారుడు చేసిన ఉల్లంఘనను పది మందిలో చర్చ పెట్టే విధంగా ట్విట్టర్‌లో ఉల్లంఘన ఫొటోను పోస్టు చేసి మీరేమనుకుంటున్నారని సలహాలు, సూచనలు కోరుతున్నారు. దీనికి గత కొద్ది రోజుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఉదాహారణకు సోమవారం కూకట్‌పల్లి అల్కాపురి ప్రాంతంలోని టౌన్‌షిప్‌ వద్ద ఆదివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడు వెనుకాల చిన్న పాపను వెనక్కి తిప్పి కూర్చోబెట్టి అతను ఒక చేత్తో బైక్‌ హ్యాండిల్‌, మరో చేతితో ఫోన్‌ మాట్లాడుతూ ప్రమాదకరమైన స్థాయిలో ప్రయాణిస్తున్నాడు.

ఈ ప్రయాణం ఎంత వరకు కరెక్ట్‌ అని దీనిపై మీ ఆలోచనను తెలుపాలని సోమవారం సైబరాబాద్‌ పోలీసులు ట్విట్టర్‌లో ఫొటోను పోస్టు చేశారు. దాదాపు 600 మంది స్పందించి ఇది ముమ్మాటికీ తప్పని,అతడికి చలాన్‌తో పాటు కేసు పెట్టాలని మరికొంత మంది కోరారు. ఈ విధంగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఉలంఘనులపై సోషల్‌ మీడియా వేదికపై నెటిజన్లను చర్చకు ఆహ్వానిస్తున్నారు. ఇలా అయినా ఉల్లంఘనదారులు మారుతారని ఆశిస్తున్నామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎమ్‌ విజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.logo