బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 13, 2020 , 08:08:37

ప్రేమ పేరుతో హోటల్ యజమాని కూతురుకు గాలం

ప్రేమ పేరుతో హోటల్ యజమాని కూతురుకు గాలం

దుండిగల్ : వివాహితుడైన వ్యక్తి హోటల్‌ యజమాని కూతురిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధిత యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దుండిగల్‌ పోలీసుల కథనం ప్రకారం.. ధూల్‌పేట్‌కు చెందిన ఓ కుటుంబం బాచుపల్లిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో స్థ్దిరపడింది. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ సమీపంలో హోటల్‌ నడుపుతున్నారు. కాగా.. నిజాంపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ రవిగౌడ్‌(24) మూడేండ్లుగా సదరు హోటల్‌కు సరుకులు రవాణా చేస్తున్నాడు.  ఈ క్రమంలో హోటల్‌ యజమాని కూతురు(22)తో ఏర్పడిన పరిచయం తో ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇద్దరు చాటింగ్‌ చేస్తూ..శారీరంగా ఒక్కటయ్యారు.

కాగా..ఆరు నెలల క్రితం యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా..దానికి అతను నిరాకరించాడు. అనుమానించిన సదరు యువతి.. అతని గురించి ఆరా తీయగా రవిగౌడ్‌కు అప్పటికే పెండ్లి అయిందని, పిల్లలు ఉన్నట్లు తేలింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎలుకలమందు తాగింది.  అక్కడి నుంచి నేరుగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ వెళ్లి రవిగౌడ్‌తో తనకు పెండ్లి చేయాలని.. లేదంటే చనిపోతానని పోలీసులకు చెప్పింది. అప్పటికే విషం తాగినట్లు గుర్తించిన పోలీసులు వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. logo
>>>>>>