బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:57:59

రచయితలు.. సాహితీవేత్తలు

రచయితలు.. సాహితీవేత్తలు

రచనల్లో జీవించి ఉంటారు

ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణాచారి

ఖైరతాబాద్‌ : రచయితలు, సాహితీవేత్తలు తమ రచనలతో శాశ్వతంగా జీవించి ఉంటారని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం-2020 కథల పోటీల విజేతలను ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డాక్టర్‌ రమణాచారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలదంకి పద్మావతి జ్ఞాపకార్థం ‘జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం’  పేరిట కథల పోటీలు నిర్వహించి, అందులో ఉత్తమ కథలకు అవార్డులు అందించడం అభినందనీయమన్నారు. మూడు దేశాలు, ఆరు రాష్ర్టాల నుంచి 275 కథలు వచ్చాయని, వాటిలో ఎంపిక చేసిన 25 ఉత్తమ కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలతోపాటు తొమ్మిది కథలను విశేష బహుమతుల కోసం ఎంపిక చేశామని జలదంకి సుధాకర్‌ తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టాక నగరంలో ఓ వేదిక ఎంపిక చేసి సినీ, సాహితీ ప్రముఖుల చేతుల మీదుగా కథా సంకలనం విడుదల, ఉత్తమ కథా రచయితలకు అవార్డులు అందించి సత్కరిస్తామన్నారు. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ దర్శకుడు వీఎన్‌ ఆది త్య, యువ కళావాహిణి అధ్యక్షుడు లయన్‌ వైకే నాగేశ్వరరావు పాల్గొన్నారు. 
logo