శనివారం 16 జనవరి 2021
Hyderabad - Aug 30, 2020 , 23:13:26

సంక్షేమ పథకాలకు ఆకర్శితులై చేరికలు

 సంక్షేమ పథకాలకు ఆకర్శితులై చేరికలు

  అరెకపూడి గాంధీ

మాదాపూర్‌, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ఇజ్జత్‌నగర్‌కు చెందిన పలువురు సీపీఐ నాయకులు.. డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, జంగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సైతం స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. నర్సయ్య, రాము, గిరి, రాంబాబు, పర్వతాలు, తిరుపతి, అంజిరెడ్డి, నాయకులు సాంబశివరావు, కట్ట సత్యం, వార్డు సభ్యుడు రాంచందర్‌, కాలనీ అధ్యక్షుడు సత్యారెడ్డి పాల్గొన్నారు.  

 కాంట్రాక్టర్ల సొంత నిర్ణయాలు సరికాదు.. 

 చెరువులను శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా అధికారుల పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్లు సొంత నిర్ణయాలతో పనులు చేయడం సరికాదని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని గుర్నాథం చెరువు వద్ద ప్రొక్లేయినర్లతో గుర్రపుడెక్కను తొలిగించడంతో వాకింగ్‌ ట్రాక్‌ దెబ్బతిన్నది దీంతో ఆయన చెరువు సుందరీకరణ పనులపై అసంతృప్తి వ్యక్తపరిచారు. జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మియాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.