సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 22, 2020 , 08:45:12

బాలికపై లైంగిక దాడికి యత్నం

బాలికపై లైంగిక దాడికి యత్నం

మారేడ్‌పల్లి : లాడ్జీలో బస చేసేందుకు మేనమామతో కలిసి వచ్చిన ఓ బాలిక పై లాడ్జి నిర్వాహకుడు లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన మేనమామతో కలిసి షాపింగ్‌ చేసేందుకు   నగరానికి చేరుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆలస్యం కావడంతో రాత్రి 9గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న రెజిమెంటల్‌బజార్‌లోని శివసాయి లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొని బస చేశారు. ఈ క్రమంలో లాడ్జి నిర్వాహకుడు కుమార స్వామి అలియాస్‌ కుమార్‌ బాలికపై కన్నేశాడు. అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో వారి గది వద్దకు వెళ్లి కొద్ది సేపట్లో రైడింగ్‌కు పోలీసులు వస్తున్నారని, గదిలో బాలిక కనిపిస్తే మీతో పాటు నాపై కూడా కేసులు నమోదు చేస్తారని చెప్పి.. పోలీసులు వచ్చి వెళ్లే వరకు బాలికను పై అంతస్థులోని మెట్లపై ఉండమని పంపించాడు. అనంతరం గదికి బయటనుంచి గడియ పెట్టి బాలికతో అసభ్యకంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించుకొని వెళ్లి గడియ తీసి విషయం మేనమామకు తెలిపింది. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.