కూకట్‌పల్లి కోర్టుల ఏజీపీగా గోవర్దన్‌రెడ్డి

69
కూకట్‌పల్లి కోర్టుల ఏజీపీగా గోవర్దన్‌రెడ్డి

కేపీహెచ్‌బీ కాలనీ, మే 11: కూకట్‌పల్లి కోర్టు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా పి.గోవర్దన్‌ రెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీలో, పొలిటికల్‌ జేఏసీలో కీలక పాత్ర పోషించిన గోవర్దన్‌ రెడ్డికి కూకట్‌పల్లి కోర్టుల ఏజీపీగా అవకాశం లభించడంపై కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులు, వివిధ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఏజీపీగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్‌ అరికపూడి గాంధీ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్య గారి నవీన్‌ కుమార్‌, కూకట్‌పల్లి కోర్టుల న్యాయమూర్తులు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.