e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News నమ్మించి లైంగిక దాడికి యత్నం

నమ్మించి లైంగిక దాడికి యత్నం

నమ్మించి లైంగిక దాడికి యత్నం

బంజారాహిల్స్‌, మే, 20: సాయం చేస్తానంటూ నమ్మబలికి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించిన నిందితుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లో స్నేహితులతో కలిసి నివాసముంటున్న యువతి(27) ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నది. ఇటీవల వేరే గది వెతుక్కుంటున్న క్రమంలో ఫేస్‌బుక్‌ ద్వారా శ్రీనగర్‌కాలనీకి చెందిన అభినవ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను గది వెతికిపెడతానంటూ స్నేహం చేసిన అభినవ్‌.. ఇటీవల ఆమెకు అవసరం కోసం రూ.15వేలు అప్పుగా ఇచ్చాడు. కాగా, ఈనెల 17న ఇల్లు చూపిస్తానంటూ.. శ్రీనగర్‌కాలనీలోని తన గదికి తీసుకెళ్లిన అభినవ్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు పెడుతూ బయటకు పరుగులు తీసింది. బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం నిందితుడు అభినవ్‌పై ఐపీసీ 354, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నమ్మించి లైంగిక దాడికి యత్నం

ట్రెండింగ్‌

Advertisement