ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jul 12, 2020 , 00:26:15

ప్రైవేట్‌ బడ్జెట్‌ పాఠశాలలను ఆదుకోవాలని వినతి

ప్రైవేట్‌ బడ్జెట్‌ పాఠశాలలను ఆదుకోవాలని వినతి

బషీర్‌బాగ్‌ : ప్రైవేట్‌ బడ్జెట్‌ పాఠశాలలను ఆదుకోవాలని తెలంగాణ రికగ్‌నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మా) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌. రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ జనరల్‌ సెక్రటరీ ఆరుకాల రామచంద్రారెడ్డి పలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఉపాధ్యాయ జేఏసీ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు వినతిపత్రాలను అందజేసినట్లు వారు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి కె. శ్రీకాంత్‌రెడ్డి, అధికార ప్రతినిధి చింతల రాంచందర్‌, గౌరవాధ్యక్షుడు జలజం సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి, హైదరాబాద్‌ అధ్యక్షుడు పీజే రెడ్డి, ఎస్‌. శ్రీపతిరెడ్డి, మారం లింగారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, రాంరెడ్డి, త్యాగరాజు, నాగయ్య, సురేశ్‌, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo