సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Sep 27, 2020 , 01:15:55

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

చిక్కడపల్లి: సమస్యలు పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం (టీఆర్‌ఎస్‌కేవీ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు శనివారం వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌, నాయకులు సంతోష్‌, కరుణ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆశల సమస్యలు పరిష్కరించాలన్నారు. కనీస వేతనం రూ.15వేల ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలన్నా రు. అర్హులైన వారిని గుర్తించి ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. నాయకులు స్వరూప, కవిత, శ్రీదేవి, హేమలత పాల్గొన్నారు.
logo