శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:39:07

బెట్టింగ్‌ రాయుళ్లు అరెస్ట్‌

బెట్టింగ్‌ రాయుళ్లు అరెస్ట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వేర్వేరు ప్రాంతాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతు న్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. చిలకలగూడ న్యూమెట్టుగూడకు చెందిన పోలపల్లి శివకుమార్‌ అమెజాన్‌లో డెలివరీ ఏజెంట్‌.  ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహించే బుకీగా మారాడు. ఇందులో భాగంగా రాజస్థాన్‌కు చెందిన కేడీ ఆన్‌లైన్‌ బుకీ నుంచి www.deltaexch.in యాప్‌ తీసుకొని... అందులో సబ్‌ ఆర్గనైజర్‌గా చేరాడు. తెలిసినవారు, స్నేహితులతో బెట్టింగ్‌ నిర్వహించడం ప్రారంభించాడు.  చిలకలగూడకు చెందిన  దద్దోజుల నవీన్‌కుమార్‌తో కలిసి న్యూ మెట్టుగూడలోని ఓ ఇంట్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్నారు.  సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు బృందం శనివారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి..  శివకుమార్‌, నవీన్‌కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 20 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.

      అలాగే..బోరబండ, వినాయక్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ మద్దూరి సుధాకర్‌ అలియాస్‌ సురేశ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న  వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు బృందం అతడిని అరెస్ట్‌ చేశారు.