e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home క్రైమ్‌ భార్యను పుట్టింటికి తీసుకువెళ్లారన్న అక్కసు

భార్యను పుట్టింటికి తీసుకువెళ్లారన్న అక్కసు

భార్యను పుట్టింటికి తీసుకువెళ్లారన్న అక్కసు
  • అత్తకు అశ్లీల వీడియోలు.. అల్లుడిపై కేసు

బంజారాహిల్స్‌, మే 30 : తనకు ఇష్టం లేకుండా భార్యను పుట్టింటికి తీసుకువెళ్లారన్న కక్షతో అత్తకు అశ్లీలపు వీడియోలు పంపించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికనగర్‌కు చెందిన యువతి వివాహం ఏడునెలల కిందట అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అక్రమ్‌పాషాతో జరిగింది. కొన్ని రోజుల తర్వాత అక్రమ్‌ భార్యను వేధింపులకు గురిచేయడంతో పాటు పుట్టింటికి వెళ్లొద్దని కట్టడి చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 29న అక్రమ్‌.. తన భార్య 5నెలల గర్భవతి కావడంతో అత్తతో కలిసి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షల అనంతరం కూతురిని పుట్టింటికి తీసుకెళ్తామని చెప్పారు.. దీనికి అక్రమ్‌ ఒప్పుకోలేదు. అయినా కూతురిని ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన అక్రమ్‌.. అత్తింటికి వెళ్లి తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు భార్యను తనతో పాటు పంపించకపోతే.. నగ్నవీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి పరువు తీస్తానంటూ బెదిరించాడు. అదే రోజు సాయంత్రం అత్త మొబైల్‌కు అశ్లీల వీడియోలు పంపించాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భార్యను పుట్టింటికి తీసుకువెళ్లారన్న అక్కసు

ట్రెండింగ్‌

Advertisement