బంజారాహిల్స్, ఏప్రిల్ 8 : ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడి వేధించడంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్‌లో నివాసముంటున్న యువతి(24) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నది. అదే ప్రాంతంలో నివాసముంటున్న గణేశ్ అలియాస్ చింటూ అనే యువకుడు ప్రతిరోజు ఆమె ఆఫీసుకు వెళ్లే సమయంలో వెంటపడుతూ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె పనిచేస్తున్న ఆఫీస్వద్దకు వెళ్లి అల్లరి చేస్తున్నాడు. ప్రేమిస్తావా లేదా అంటూ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు సోషల్‌మీడియాలో ఫొటోలు పెట్టి పరువు తీస్తానంటూ బెదిరిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన యువతి గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు గణేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.