ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 08:21:45

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు

సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 29 : జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం అధికారులు  కసరత్తు ప్రారంభించారు. వర్షాలు పడి  బిజీబిజీగా ఉన్న అధికారులు ఇప్పుడు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తోడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దగ్గర  పడుతుండటంతో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. పోలింగ్‌ కేంద్రాల నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే గతంలో పోలింగ్‌కోసం వినియోగించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్నింటిని కూల్చివేయగా, మరికొన్ని పోలింగ్‌ బూత్‌లను మార్చారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో 220 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 11 పోలింగ్‌ బూత్‌లను మార్చారు. ఇదిలా ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గతంలో 5 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా పెరిగిన ఓటర్ల దృష్టిలో పెట్టుకొని పోలింగ్‌ కేంద్రాలను కూడా పెంచడం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

పాత పోలింగ్‌  కేంద్రాలు                       కొత్త పోలింగ్‌ కేంద్రాలు


 అడ్డగుట్ట కమ్యూనిటీహాల్‌ 10, 11, 12             శ్రీ సరస్వతి విద్యాలయం              

 లాలాగూడ టినీటాట్స్‌ స్కూల్‌  105                లిల్లీ మోడల్‌ స్కూల్‌

 మెట్టుగూడ జైనీజాయ్‌  స్కూల్‌  131               సెయింట్‌ ఎగ్నీస్‌ గ్రామర్‌ స్కూల్‌

 సీతాఫల్‌మండి శ్రీనివాస్‌నగర్‌  65, 66            అమరావతి టాలెంట్‌ స్కూల్‌

 నామాలగుండు  149, 157                         మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌,  స్వామివివేకానంద విద్యా మందిర్‌  72, 73        విజ్ఞాన్‌ హై స్కూల్‌, బౌద్ధనగర్‌


డివిజన్‌                  రిటర్నింగ్‌ అధికారి,నంబర్‌                   అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి 

అడ్డగుట్ట         నవనీత, 7288894642               మునిరొద్దీన్‌ 9642126551

తార్నాక        ఆంజనేయులు,9441889498         సంధ్యారాణి, 9121872564

మెట్టుగూడ      శ్రీనివాస్‌రెడ్డి, 9121136361         సునంద, 9704362727      

సీతాఫల్‌మండి  రాంచంద్రయ్య, 9985145911      స్మిత , 8919518797

బౌద్ధనగర్‌       సంగీత, 7288894635             ప్రేమ్‌ కుమార్‌, 8008301521