ముషీరాబాద్:టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ బర్కత్‌పుర, ఫీవర్ ఆసుపత్రి, శ్రీరామ్‌నగర్, గాంధీకుటీర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 30తేదీ(నేడు)సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ విభాగం ఏడీఈ ఎం.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.బర్కత్‌పుర ఫీడర్ పరిధిలోని బర్కత్‌పుర, పద్మకాలనీ, శంకర్‌మఠ్ కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
మధ్యాహ్నం 2 గంటల నపుంచి 4 గంటల వరకు ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని అంజయ్య క్వార్టర్స్, ఫీవర్ ఆసుపత్రి, తెలంగాణ యువతి మండలి, బర్కత్‌పుర పెట్రోల్ పంపు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీరామ్‌నగర్ పీడర్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, అచ్చనగర్, లంబాడి తండా, ఫీవర్ ఆసుపత్రి వెనక వైపు పరిసర ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదు.మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీకుటీర్ ఫీడర్ పరిధిలోని సంగం హోటల్, నారాయణ స్కూల్, బాలాజీ రెసిడెన్షీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.