శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 16, 2020 , 07:37:17

ఇగ్నో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఇగ్నో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ ‌: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో మేనేజ్‌మెంట్‌, పీహెచ్‌డీల్లో  ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఎస్‌ ఫయాజ్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 29న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వారు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు ignouexams.nta.nic.in, 9492451812, 040-23117550 ఫోన్‌ నంబర్‌ల్లో సంప్రదించాలని సూచించారు. 


logo