గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 21, 2020 , 00:46:30

కరోనా బాధితులకు ఆపన్నహస్తం

కరోనా బాధితులకు ఆపన్నహస్తం

ఆక్సిజన్‌ సిలిండర్‌లు అందజేస్తున్న తీగుళ్ల రామేశ్వర్‌గౌడ్‌ 

 సికింద్రాబాద్‌ : కరోనా బారినపడిన వారికి డిప్యూటీ స్పీకర్‌ కుమారుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కరోనా సమస్యలతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి అండగా ఉంటున్నా రు. తమ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందులు నియోజకవర్గం ప్రజలు పడకూడదని నెలరోజులుగా నియోజకవర్గంలో   ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి డిప్యూటీ స్పీకర్‌ కుమారుడు తీగుళ్ల రామేశ్వర్‌ గౌడ్‌ ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌లను అందజేస్తున్నారు. కరోనా వచ్చిన వారికి జ్వరం, జలుబు లాంటి సమస్యలే కాకుండా.. కొందరికి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కరంగా ఉంటుంది. ఈ క్రమంలో రామేశ్వర్‌గౌడ్‌ సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఆక్సిజన్‌ సిలిండర్‌లు అవసరమైన వారికి అందజేస్తున్నారు. ఇప్పటి  వరకు నియోజకవర్గంలో దాదాపు 450 మందికి సిలిండర్‌లను అందజేశారు. ఎంతమందికైనా అందజేస్తాం..

కరోనాతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఎంతమందికైనా సిలిండర్లు అం దజేస్తామని డిప్యూటీ స్పీకర్‌ కుమారుడు తీగుళ్ల రామేశ్వర్‌ గౌడ్‌ అన్నారు. కరోనా వచ్చి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఇబ్బందులు పడ్డారు. ఒకదశలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలె త్తి అ వస్థ పడ్డారు. అర్ధరాత్రి యశోద ద వాఖానకు తరలించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌లు అందజేస్తున్నామని ఆయన అన్నారు. 

 


logo