శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Sep 29, 2020 , 00:23:26

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

ఖైరతాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక చట్టాన్ని విరమించుకోవాలని ఏఐసీసీ ఇన్‌చార్జి ఠాగూర్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు పొన్నం ప్రభాకర్‌, సంపత్‌ కుమార్‌, దామోదర రాజనర్సింహ, శ్రీనివాస్‌ కృష్ణన్‌, గీతారెడ్డి, దాసోజు శ్రావణ్‌లతో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం అందించేందుకు సోమవారం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అనుమతి లేదని అధికారులు చెప్పడంతో వారు దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ బిల్లును విరమించేంత వరకూ ఆందోళన ఆపేది లేదన్నారు.