శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:58:02

గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావుకు క్షీరాభిషేకం

గాంధీ సూపరింటెండెంట్‌  డాక్టర్‌ రాజారావుకు క్షీరాభిషేకం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ‘బతుకుపై ఆశలు వదులుకున్న నాకు పునర్జీవం పోసిన దేవుడు గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు’ అని కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న రఫిక్‌ అన్నారు. మంచిర్యాల ప్రాంతానికి చెందిన రఫిక్‌ ఇటీవలే కరోనాకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో గాంధీ దవాఖానను ఆశ్రయించాడు. ఒక దశలో తన ప్రాణాలపై ఆశలు వదులుకున్న తనకు డా.రాజారావు మనోధైర్యం చెబుతూ భరోసా కల్పించారని, కంటికి రెప్పలా చూసుకున్నారని బాధితుడు రఫిక్‌కు తెలిపారు. దవాఖాన నుంచి డిశ్చార్జి తరువాత రఫీక్‌ తన సొంత గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఆదివారం డాక్టర్‌ రాజారావు చిత్రపటానికి తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి క్షీరాభిషేకం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నాడు.