అమరావతి : సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తన ఆవేదనను ఓ సెల్పీ వీడియోలో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఎమిగనూర్లో హోంగార్డుగా విధులు నిర్వర్తించే రామకృష్ణమ్మ ఇటీవల బదిలీపై ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చింది. వచ్చిన నాటి నుంచి సీఐ నరేష్ ఆమెను ఎందుకు వచ్చావు.. పనిష్మెంటా.? వివాదమా.? అంటూ ప్రశ్నిస్తూ ఇటీవల ఆమె పాస్‌పోర్టును తిప్పించాడు. తన పాస్‌పోర్టును ఎందుకు తిప్పి పంపారంటూ సీఐని ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించారని రామకృష్ణమ్మ సెల్ఫీ వీడియోలో వాపోయింది. తనను మానసిక క్షోభకు గురిచేసిన సీఐని కఠినంగా శిక్షించాలని రామకృష్ణమ్మ డిమాండ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.