శనివారం 30 మే 2020
Hyderabad - May 19, 2020 , 01:34:50

సైక్లింగ్‌ చేస్తూ..కిందపడి అమెరికావాసి మృతి

సైక్లింగ్‌ చేస్తూ..కిందపడి అమెరికావాసి మృతి

మణికొండ : సైక్లింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అమెరికా దేశస్తుడు మృతిచెందాడు. ఈ సంఘటన నా ర్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌  గంగాధర్‌ కథనం ప్రకారం.. అమెరికాలోని స్టేట్‌ కార్పొరేషన్‌ సంస్థలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఎరికా అంజెలినా, భర్త రాబర్ట్‌ లిటిల్‌ జాన్‌ దంపతులు గచ్చిబౌలిలోని షంగ్రిల్లా అపార్టుమెంట్‌లో నివాసముంటున్నారు.   రాబర్ట్‌(39) గచ్చిబౌలి నుంచి కోకాపేట ఔటర్‌ సర్వీస్‌రోడ్డు నుంచి గండిపేట వరకు సైక్లింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అయితే.. ఆ ప్రాంతం నిర్మానుష్యం గా ఉండటంతో అతన్ని ఎవరూ గుర్తించలేదు. 

ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని భార్య  నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. రాబర్ట్‌ ఫోన్‌ ట్రాకింగ్‌ ఆధారంగా ప్రమాద సంఘటనను తెలుసుని పరిశీలించగా అప్పటికే రాబర్ట్‌ లిటిల్‌ జాన్‌(39) మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సైక్లింగ్‌ చేస్తూ ఊపిరాడకపోవడంతోనే కిందపడి మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అమెరికా నుంచి ఎంప్లాయీస్‌ వీసాపై ఇండియాకు ఈ దంపతులు వచ్చినట్లు, మృతుడు అమెరికాలో ట్రక్కు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


logo