బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 29, 2020 , 00:23:42

ప్రతిష్టాత్మకంగా పట్టభద్రుల నమోదు

ప్రతిష్టాత్మకంగా పట్టభద్రుల నమోదు

 ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్‌రెడ్డి 

కంటోన్మెంట్‌: త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి బోర్డు సభ్యుడిపై ఉందని కంటోన్మెంట్‌ శాసన సభ్యులు సాయన్న  అన్నారు. సోమవారం డైమండ్‌పాయింట్‌ సమీపంలోని గాయత్రి గార్డెన్స్‌లో మల్కాజిగి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సదా కేశవరెడ్డి, అనితాప్రభాకర్‌, నళినికిరణ్‌, పాండుయాదవ్‌, భాగ్యశ్రీ, లోక్‌నాథం, డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల రూప, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌తో కలిసి పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. ప్రతి బోర్డు సభ్యుడు తమ తమ వార్డు పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్‌లను గుర్తించి.. వారు ఓటరుగా నమోదు చేయించుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటు నమోదును ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు. 2017కు ముందు డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్టోబర్‌ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రారంభం కానుందని, ఓటర్‌ నమోదులో మొదటి స్థానంలో నిలవాలని సూచించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఇందుకు సైనికుల్లా పని చేయాలన్నారు. 

విజయం సాధించేలా కృషి చేయాలి

పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మల్కాజిగి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల ఓటరు నమోదులో బోర్డు సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని నమోదు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పార్టీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, ఇందులో అర్హత కలిగిన ప్రలి ఒక్కరినీ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ఓటరు లిస్టు ఆధారంగానే గ్రాడ్యుయేట్స్‌ కోటా ఎన్నికలు జరుగుతాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కో ఆప్షన్‌ సభ్యులు నర్సింహా ముదిరాజ్‌, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్‌, శ్యాంకుమార్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పెద్దాల నర్సింహ, ప్రభుగుప్తా, ఆలయ కమిటీ చైర్మన్లు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. logo