శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 26, 2020 , 23:46:58

ఆదర్శనియోజక వర్గంగా అంబర్‌పేట

ఆదర్శనియోజక వర్గంగా అంబర్‌పేట

కాలేరు వెంకటేశ్‌

అంబర్‌పేట: అన్నిరంగాల్లో అంబర్‌పేటను ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. నల్లకుంట డివిజన్‌లోని యంగ్‌మెన్‌ లోకల్‌ లారీ లేన్‌లో రూ.6 లక్షలతో కొత్తగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్‌ కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవిరమేశ్‌తో కలిసి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలోని కాలనీల్లో శిథిలావస్థకు చేరిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో  పర్యటించి వివరాలు తెలుసుకొని తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయించామన్నారు.  అవసరమైన చోట బీటీ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు.  పార్కులను కూడా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.  ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీఈ సంతోష్‌, ఏఈ స్వప్న, టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు భగవాన్‌, నాయకులు రాజుగౌడ్‌, బలరాం, నాగరాజు, బస్తీవాసులు మల్లేశ్‌, ధన్‌రాజ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నగేశ్‌, రాము, హరి, బలరామకృష్ణ, జీవన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

 స్థానికుల సహకారంతో అభివృద్ధి..

కాచిగూడ : స్థానికుల సహకారంతో అంబర్‌పేట నియెజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కాచిగూడ డివిజన్‌లోని భూమన్నగల్లీ, శాలినీ దవాఖాన లైన్‌ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎక్కాల కన్నా, సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. కాచిగూడ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బద్దుల ఓం ప్రకాశ్‌యాదవ్‌, దేవిరెడ్డి విజితారెడ్డి, కాచిగూడ ఇన్‌స్పెక్టర్లు హబీబుల్లాఖాన్‌, అనుమాల శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ డీసీ వేణుగోపాల్‌, డీఈ సంతోశ్‌, ఏఈ ప్రేరణ, ప్రతాప్‌, శ్రీనివాస్‌, సునీల్‌, మహేశ్‌కుమార్‌, నాగేందర్‌బాబ్జీ  పాల్గొన్నారు.