బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:27:47

భారీ వర్షాలతో అప్రమత్తం

భారీ వర్షాలతో అప్రమత్తం

హైఅలర్ట్‌ ప్రకటించిన బల్దియా 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రెండు రోజులుగా కురుస్తున్న కుండపోతతో పాటు మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగరవాసులు అత్యవసరమైతే తప్ప.. ఇండ్ల నుంచి బయటకు రావద్దని బల్దియా సూచించింది. గురువారం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో ముంపు సమస్య తలెత్తడంతో సహాయక చర్యల కోసం మాన్‌సూన్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను రంగంలోకి దింపింది. అలాగే, ఎటువంటి విపత్తు సంభవించినా వెంటనే రంగంలోకి దిగేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను అప్రమత్తం చేసింది. సహాయం కోసం కాల్‌ సెంటర్‌ 2111 1111కు, లేక విపత్తుల నిర్వహణ విభాగం నంబరు 040-29555500కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. వర్షం కారణంగా బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల మధ్య జీహెచ్‌ఎంసీకి 205 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఇందులో రోడ్లకు సంబంధించినవి 45 ఉండగా, ముంపు విషయమై 126 ఫిర్యాదులు ఉన్నట్లు వివరించారు. అలాగే, చెట్లు నేలకూలడం, కొమ్మలు విరిగిపడటం వంటివి 28 , గోడలు కూలినవి  ఆరు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. 


logo