e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ కరోనా సేవలో ఎయిర్‌కార్గో

కరోనా సేవలో ఎయిర్‌కార్గో

కరోనా సేవలో ఎయిర్‌కార్గో
  • మెడికల్‌ సామగ్రి రవాణాకు ఫార్మాజోన్‌
  • 11,500 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు చేరవేత
  • 100 టన్నులకుపైగా వ్యాక్సిన్లు రవాణాచేసిన జీఎంఆర్‌

హైదరాబాద్‌, మే 26 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌కార్గో (జీహెచ్‌ఏసీ) తనవంతు సేవలు అందిస్తున్నది. కొవిడ్‌ రిలీఫ్‌ మెటీరియల్‌ను సమర్థంగా చేరవేస్తున్నది. కొవిడ్‌ వైద్యసేవల్లో వినియోగించే వైద్యపరికరాలు, పీపీఈకిట్లు, మాస్కులు, శానిటైజర్లతోపాటు, వ్యాక్సిన్లు వంటి కొవిడ్‌ రిలీఫ్‌ మెటీరియల్స్‌ను తీసుకువెళ్లే అనేక ఫ్రెయిటర్‌ విమానాలను నిర్వహిస్తున్నది. కొవిడ్‌ రోగుల చికిత్సలో కీలకమైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను హైదరాబాద్‌కు తీసుకురావంలో విజయవంతమయింది.

దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు దేశాల నుంచి మే 1 తర్వాత హైదరాబాద్‌ విమానాశ్రయానికి 11,500 యూనిట్ల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను చేరవేసింది. కొవిడ్‌ రిలీఫ్‌ మెటీరియల్‌ను వేగంగా క్లియర్‌ చేయడానికి కస్టమ్స్‌ అధికారులు, విమానయాన సంస్థలు, సరకు రవాణా ఫార్వార్డర్లు, ఇతర వాటాదారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఇటీవల ఓ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి పెద్దమొత్తంలో విరాళంగా అందించిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విజయవంతంగా రవాణా చేయడంలో హైదరాబాద్‌ కార్గో దోహదపడింది. మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వాటిని అందుకున్నారు. రష్యా నుంచి రెండు స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్ల సరఫరాలోనూ ముందున్నది.

ఫార్మా జోన్‌ విస్తరణ

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌ అతిపెద్ద కేంద్రంగా మారనున్నది. వచ్చే 18-24 నెలల్లో ఇక్కడ 3.6 బిలియన్‌ మోతాదుల వ్యాక్సిన్లు ఉత్పత్తవుతాయనేది అంచనా. జనవరి 2021 తర్వాత హైదరాబాద్‌ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 100 టన్నులకుపైగా వ్యాక్సిన్లను రవాణా చేసింది. హైదరాబాద్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్లు, రిలీఫ్‌ సామగ్రి రవాణా పెరగనున్నందున విమానాశ్రయం ల్యాండ్‌సైడ్‌, ఎయిర్‌సైడ్‌ సౌకర్యాలను విస్తరిస్తున్నది. వ్యాక్సిన్‌ టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ ఔషధాలకు అవసరమైన ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తున్నది. ఇందులోభాగంగా ప్రస్తుతం ఉన్న ఫార్మాజోన్‌ను రెట్టింపుస్థాయిలో విస్తరిస్తున్నది. 15-25 డిగ్రీలు, 2-8 డిగ్రీలు, 20 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌ జోన్లను విస్తరిస్తున్నది. సరకులను అన్‌లోడ్‌ చేసే సమయంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు విస్తరించనున్న ఫార్మాజోన్‌లో కోల్డ్‌ సూపర్‌స్టోర్‌ను సైతం ప్రవేశపెడుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా సేవలో ఎయిర్‌కార్గో

ట్రెండింగ్‌

Advertisement