బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 23:46:10

మోడ్రన్‌ టాయిలెట్లకు శ్రీకారం

మోడ్రన్‌ టాయిలెట్లకు శ్రీకారం

నియోజకవర్గంలో నాలుగు చోట్ల ఏర్పాటు 

 హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ముషీరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-15 ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో మోడ్రన్‌ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్ల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రద్దీ ప్రదేశాలైన పార్కులు, ప్రధాన రోడ్లు, కూడళ్లలో మహిళలకు సౌకర్యవంతంగా ఉండేలా అధునాతన షీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో షీ టాయిలెట్లతో పాటు పురుషుల కోసం మోడ్రన్‌ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనకు తావులేకుండా సర్కిల్‌-15 ముషీరాబాద్‌ నియోజకవర్గాన్ని స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి చర్య లు తీసుకుంటున్నారు. అధునాత టెక్నాలజీతో ఇప్పటికే ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన అధికారులు త్వరలో ఇందిరాపార్కు, సుందరయ్య పార్కుల వద్ద ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పటిష్టంగా నిర్వహణ..

బహిర్భూమికి వెళ్లేందుకు మహిళలు ఇబ్బంది పడకూడదనే మోడ్రన్‌ షీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటి నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం అర్హులైన వారిని(బీఓటీ)పద్ధతిలో ఎంపిక చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో పాటు అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

 - ఉమ, సర్కిల్‌-15 డిప్యూటీ కమిషనర్‌ logo