గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Sep 23, 2020 , 00:36:42

ప్రశాంతతకు భంగం కల్గిస్తే చర్యలు

ప్రశాంతతకు భంగం కల్గిస్తే చర్యలు

నగర సీపీ అంజనీకుమార్‌

ప్రశాంతతకు భంగం కల్గించేవారిపై కఠినంగా వ్యవహరించాలని నగర సీపీ అంజనీకుమార్‌ అధికారులను ఆదేశించారు.. మంగళవారం జోనల్‌ జాయింట్‌ సీపీలు, డీసీపీలతో సీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జోన్లలో రౌడీలు, పీడీయాక్టులకు సంబంధించిన అంశాలతో పాటు పెండింగ్‌ కేసుల విషయాలపై చర్చించారు. సమావేశంలో అదనపు సీపీలు శిఖా గోయెల్‌, జాయింట్‌ సీపీలు ఏఆర్‌ శ్రీనివాస్‌, విశ్వప్రసాద్‌, రమేశ్‌, డీసీపీలు కల్మేశ్వర్‌ సింగనవర్‌, గజరావు భూపాల్‌తో పాటు ఆయా డివిజన్ల ఏసీపీలు పాల్గొన్నారు.  - సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ