బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Jun 07, 2020 , 23:51:10

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం

హైదరాబాద్  :  కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌, జేఏసీ కన్వీనర్‌, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో  కలిశారు.  వైద్య,  విద్యా సంచాలకుల కింద పని చేస్తున్న వైద్యులకు పీఆర్సీ, ఏరియర్స్‌ అందేవిధంగా చ ర్యలు తీసుకున్నందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  వైద్య వి ధాన పరిషత్‌లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులతో పాటు డిప్యూటీ సీఎస్‌ల పదోన్నతులను చేపట్టాలని కోరారు. కరోనా నేపథ్యంలో డైరెక్టర్‌ ఆ ఫ్‌ హెల్త్‌ వైద్య సిబ్బందిని క్వారంటైన్‌ చేయాలని కోరారు.  దవాఖానలోనే విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో పాజిటివ్‌  కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక దృషి ్ట పెట్టాలని మంత్రిని కోరారు.


logo