శనివారం 11 జూలై 2020
Hyderabad - Jun 06, 2020 , 02:33:48

ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారుల చర్యలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారుల చర్యలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జాల చెరవీడుతున్నాయి. ఇంత కాలం అన్యాక్రాంతమైన స్థలాలు ప్రభుత్వ పరమవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో భూ నిధి కళకళలాడుతున్నది. ఈ మేరకు హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములపై జిల్లా అధికారులు సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం జిల్లాలో ల్యాండ్‌ బ్యాంక్‌ పార్సిళ్ల సంఖ్య 1,230కి చేరాయి.  హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ వచ్చిన శ్వేతామహంతి.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై దృష్టిపెట్టారు. జిల్లాలో ల్యాండ్‌ బ్యాంక్‌లోని భూములు, వివాదాస్పద, వివాదరహిత భూముల వివరాలపై ఆరా తీస్తున్నారు. నిర్మాణాలున్న స్థలాలు, ఖాళీ స్థలాల వివరాలను క్రోడీకరిస్తున్నారు. మండలాల వారీగా తహసీల్దార్లతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

పర్యవేక్షణకు సాఫ్ట్‌వేర్‌..

ల్యాండ్‌ బ్యాంక్‌లో చేర్చిన ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు వినూత్న మార్గంలో ముందుకెళ్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ స్థలాలను కాపాడబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి.. దాని ఆధారంగా స్థలాలను జియో ట్యాగింగ్‌ చేసి పర్యవేక్షించనున్నారు. ఓ ప్రైవేట్‌ సంస్థతో సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయిస్తున్నారు. 


logo