గురువారం 04 మార్చి 2021
Hyderabad - Jan 22, 2021 , 07:45:19

సాక్ష్యం గెలిచింది

సాక్ష్యం గెలిచింది

 ఉస్మానియా యూనివర్సిటీ, : ప్రేమించట్లేదనే కారణంతో ఇంటర్‌ చదువుతున్న మైనర్‌ బాలికను అతిదారుణంగా గొంతు కోసి హత్య చేసిన నిందితుడికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు సాక్షులను నగర జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌రెడ్డి  ఘనంగా సన్మానించారు. ఆర్ట్స్‌ కళాశాల రైల్వే స్టేషన్‌ పక్కన ఉన్న క్వార్టర్స్‌లో 2018 ఆగస్టు 7న అనూష అనే బాలికను ఆరెపల్లి వెంకట్‌ (25) గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిని దోషిగా కోర్టులో నిరూపించడంతో, అతడికి జీవితఖైదుతో పాటు రూ.పది వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అయితే.. ఈ కేసులో సాక్షులుగా ఉన్న అబ్దుల్‌ ఎజాజ్‌, మొహమ్మద్‌ జాహిద్‌, మొహమ్మద్‌ ఇమ్రాన్‌కు ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి రూ. లక్ష ఇస్తామని, సాక్ష్యం చెప్పకూడదని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ.. దీనికి వారు నిరాకరించి, ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్పారు. దీంతో నిందితుడికి శిక్ష పడింది. ఈ నేపథ్యంలో వారిని అభినందిస్తూ ఇతర పోలీస్‌ అధికారుల ఎదుట వారిని ఘనంగా సన్మానించారు. 


VIDEOS

logo