గురువారం 04 మార్చి 2021
Hyderabad - Feb 24, 2021 , 05:12:34

అవగాహనతోనే ప్రమాదాల నివారణ

అవగాహనతోనే ప్రమాదాల నివారణ

సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల మరణాలు తగ్గించేందుకు ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలని ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అధికారులకు సూచించారు. మంగళవారం ట్రాఫిక్‌ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... ట్రాఫిక్‌ విభాగం నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయా పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు, ఏసీపీల వద్ద నుంచి సమాచారం సేకరించారు. రోడ్డు ప్రమాదాల మరణాలను కట్టడి చేయడం, నిబంధనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకోవడంపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీసీపీ చౌహాన్‌, అదనపు డీసీపీలు కరుణాకర్‌, భాస్కర్‌, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo