గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:46:50

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ 

ఉస్మానియా యూనివర్సిటీ :  నియోజకవర్గం పరిధిలో యాభై ఏండ్లుగా  జరుగని అభివృద్ధిని , ఐదేండ్లలో ప్రారంభించి పూర్తి చేశామని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ అన్నారు. తార్నాక డివిజన్‌లో రూ.71 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ శుక్రవారం ప్రారంభించారు. రూ.18 లక్షలతో లాలాపేట లక్ష్మీనగర్‌లో కల్వర్టుపై నిర్మించిన స్లాబ్‌, తార్నాక ప్రాంతంలో రూ.53 లక్షలతో నిర్మించిన ఫుట్‌పాత్‌లను  స్థానిక కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతీహరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలాపేట రోడ్డు విస్తరణను సైతం చేపట్టామన్నారు. సత్యనగర్‌, చంద్రబాబునగర్‌, సిరిపురి కాలనీ, లక్ష్మీనగర్‌ ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకోకుండా లాలాపేట కల్వర్టు విస్తరణ సైతం పూర్తి చేశామని చెప్పారు. ఎటువంటి సమస్యలున్నా.. తమ కార్యాలయం నంబర్‌ 040-27504448 కు ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువనేత తీగుళ్ల రామేశ్వర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఆలకుంట హరి, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. logo