బుధవారం 21 అక్టోబర్ 2020
Hyderabad - Sep 07, 2020 , 01:45:01

అభివృద్ధికి పెద్దపీట

అభివృద్ధికి పెద్దపీట

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌

ఆరోగ్యనగర్‌ వాసులు టీఆర్‌ఎస్‌లో చేరిక

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఎర్రగడ్డ:  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేసి ఎస్పీఆర్‌హిల్స్‌ ప్రాంత రూపురేఖలు మార్చామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. ఆదివారం ఎస్పీఆర్‌హిల్స్‌లోని ఆరోగ్యనగర్‌ బస్తీ వాసులు రవీందర్‌, కా శీ, కృష్ణ, జోసెఫ్‌, సలీం, అజార్‌ తదితరులు ఎమ్మెల్యే స మక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాదరణ ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని, ప్రతి ఎన్నికల్లో విజయబావుటా ఎగరవేసిందన్నారు. ఎస్పీఆర్‌ హిల్స్‌లోని బస్తీ ప్రజలకు  గత పాలకులు కనీస సౌకర్యాలను కల్పించటంలో విఫలమయ్యారన్నారు. అనంతరం ఆరోగ్యనగర్‌ బస్తీ వాసులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి షరీఫ్‌, నాయకులు సీఎన్‌ రెడ్డి, లియాఖత్‌ అలీ, సుబ్బరాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 పనులను పరిశీలించాలి: ఎమ్మెల్యే

కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గానికి చెం దిన ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.  పనులను కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని సూ చించారు. పనులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇంకా జరగాల్సిన పనులకు కావల్సిన నిధులు, ఇప్పటికే జరుగుతున్న పనులకు నిధుల కొరత ఉంటే త్వరగా మం జూరయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రతి కాలనీలో పారిశుధ్య పనులు  జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేటర్లు ముద్దం నర్పింహయాదవ్‌, తూము శ్రావణ్‌కుమార్‌, నరేంద్రచార్య, పండాల సతీశ్‌గౌడ్‌, సబీహాబేగం, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.logo