గురువారం 28 మే 2020
Hyderabad - May 19, 2020 , 01:28:11

కార్లు డెలివరీ అంటూ 7 లక్షల టోకరా

కార్లు డెలివరీ అంటూ 7 లక్షల టోకరా

  హైదరాబాద్  : లాక్‌డౌన్‌లో సైతం కార్లు డెలివరీ చేస్తామని కస్టమర్లను మోసం చేసిన ఇద్దరిని మియాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓబుల్‌రెడ్డి(26), సుస్మిత(40)లు మదీనగూడ లక్ష్మీ హుందాయ్‌ షోరూంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. తమ షోరూంలో కార్లు బుక్‌ చేసుకున్న ఇద్దరు కస్టమర్లకు ఫోన్‌ చేసి లాక్‌డౌన్‌లోనూ కార్లు డెలివరీ ఇస్తామంటూ నమ్మిం చి... వారి నుంచి రూ.7 లక్షలు తమ బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఎంతకీ కార్లు డెలివరీ కాకపోవడంతో సదరు కస్టమర్లు మోసం జరిగిందని గుర్తించి   మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితులు ఓబుల్‌రెడ్డి, సుస్మితలను అరెస్ట్‌ చేసి  రిమాండ్‌కు తరలించారు. 


logo