మంగళవారం 14 జూలై 2020
Hyderabad - Jun 29, 2020 , 23:58:02

కూకట్‌పల్లిలో 5.1 సెం.మీ.

కూకట్‌పల్లిలో 5.1 సెం.మీ.

మరో మూడు రోజులు వర్షసూచన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది.  కూకట్‌పల్లి, బాలానగర్‌లో అత్యధికంగా 5.1 సెం.మీ, ముషీరాబాద్‌లో 4.8 సెం.మీ, అత్యల్పంగా అంబర్‌పేటలో 1.0 సెంటీమీటర్ల వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులు వర్షం కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.7 డిగ్రీలు, గాలిలో తేమ 95 శాతంగా నమోదైనట్లు  వెల్లడించారు.


logo